భారతదేశ ఆర్థికాభివృద్ధికి ఎనలేని కృషి చేసిన గొప్ప ఆర్థిక మేధావి డాక్టర్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని, వారి నాయకత్వంలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని జడ్చర్ల శాసనసభ్యులు అనిరుధ్ రెడ్డి అన్నారు. శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.