జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల కేంద్రంలో వీధి కుక్కలు విపరీతంగా పెరిగిపోయని స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. ఎటు చూసినా గుంపులు గుంపులుగా వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. పగటివేల చిన్నారులు ఒంటరిగా రోడ్లపై నడుచుకుంటూ వెళ్లాలంటే భయాందోళనకు గురవుతున్నారు. రాత్రివేళ వాటి అరుపులతో ప్రజల కంటిమీద కులుకు లేకుండా చేస్తున్నాయి. విధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.