ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సొంత నియోజక వర్గం కోడంగల్ లో శనివారం తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని చూడగానే కార్యకర్తలు, అభిమానులు ఒక్కసారిగా కేరింతలు కొడుతూ. జేజేలు పలికారు. సీఎంకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. అనంతరం వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.