ఊరుకొండలో 15 రోజులపాటు స్వచ్ఛందంగా లాక్ డౌన్

981చూసినవారు
ఊరుకొండలో 15 రోజులపాటు స్వచ్ఛందంగా లాక్ డౌన్
ఊరుకొండ మండల కేంద్రంలో 15 రోజులపాటు స్వచ్ఛందంగా లాక్ డౌన్ ప్రకటిస్తున్నట్లు సర్పంచ్ అనిత అన్నారు. ఆదివారము గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ వార్డు సభ్యులతో సమావేశమయ్యారు. కరోనా వ్యాప్తిని నిరోధించడానికి 15 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటిస్తున్నామని ప్రజలు, వ్యాపారులు సహకరించాలని సర్పంచ్ అన్నారు. సమావేశంలో ఉప సర్పంచ్ బుజ్జమ్మ, వార్డు సభ్యులు అజహర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్