నవాబుపేట మండలంలో చెరువులో పడి ఓ మహిళ మరో ఇద్దరు పిల్లలు మృతి చెందిన ఘటన తెలిసిందే. పొమాల్ గ్రామస్థుల వివరాల ప్రకారం. గ్రామానికి చెందిన సరోజ (25) బట్టలు ఉతకడానికి తన ముగ్గురు పిల్లలు మిల్కీ, కన్న, తేజ తీసుకొని చెరువు వద్దకు వెళ్లింది. మిల్కీ, కన్న ప్రమాదవశాత్తు చెరువులో జారిపోయారు. గమనించిన సరోజ తేజను కాపాడింది. మరో ఇద్దరు చిన్నారులు, సరోజ నీటిలో మునిగి మృతి చెందారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.