మహబూబ్ నగర్ జిల్లాకు నూతనంగా మంజూరైన నవోదయ పాఠశాలను జడ్చర్ల మండలంలోని వల్లూరు గ్రామంలో ఏర్పాటు చేయడానికి నియోజకవర్గంలోని అన్ని పార్టీల నాయకులు ఎంపీ డీకే అరుణని కలిసి కోరుదామని ఆదివారం ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్ రెడ్డి అన్నారు. వల్లూరు గ్రామంలో 35ఎకరాల ప్రభుత్వ భూమి ఉందన్నారు. నియోజకవర్గంలోని అన్ని పార్టీల సహకారం కావాలన్నారు. విద్యాపరంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే అన్నారు.