మహబూబునగర్ జిల్లా మిడ్జిల్ మండలం, దోనూర్ గ్రామంలో ప్రతికాలనీలోఉన్న కలుపు మొక్కలని, దోమలకు నిలయమైన మురుగునీటి గుంతలలోఉన్న చెత్తను పారిశుధ్య కార్మికులు, దినసరి కూలీలు, ప్రజలందరూ కలిసి తొలగించడం జరిగింది. ఈ వర్షాకాలంలో అంటువ్యాదులు సోకకుండా గ్రామప్రజలందరు తమతమ ఇంటిపరిసరాలను పరిశుబ్రాంగా ఉంచుకోవాలని గ్రామ సర్పంచ్ చెన్న సరిత గారు ప్రజలందరికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వార్డ్ మెంబర్స్, గ్రామ పెద్దలు, గ్రామ సెక్రటరీ పాల్గొన్నారు.