దుందుభి నదిలో పడి కాడెద్దులు మృతి

1534చూసినవారు
దుందుభి నదిలో పడి కాడెద్దులు మృతి
జడ్చర్ల మండలం, కొండెడ్ గ్రామంలో ఉన్న దుందుభి నదిలో శనివార కురిసిన భారీ వర్షానికి పరవళ్లు తొక్కుతూ.. నదిపై నిర్మించిన బ్రిడ్జిపైనుండి దాదాపు మూడు మీటర్ల వరకు ప్రవహించింది. ఇదే సమయంలో బాలయ్య అనే రైతు తన రొండు కాడెద్దులను బ్రిడ్జిపై నుండి తన పొలం వైపు దాటిస్తున్న సమయంలో..నది ప్రవాహానికి కొట్టుకొని, నదిలో పడి కొంత దూరం వెళ్లిన తర్వాత రెండు ఎద్దులు మృతి చెందడం జరిగింది.దీంతో అతని కుటుంబంలో విషాదం నిండుకుంది.వ్యవసాయ పని చేసి అన్నివిధాలుగా కుటుంబానికి తోడున్న ఎద్దులు లేకపోవడంతో గుండెలు పగిలేలా ఏడ్చారు.స్థానిక ప్రజలు ,ప్రజా ప్రతినిధులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ బాలయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్