పేద ప్రజల సంక్షేమ పథకాలు సత్వరమే అర్హులకు అందాలిని, రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు అభయహస్తం హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి మాట్లాడుతూ. రాష్ట్ర మహిళలందరికీ ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని, ఇప్పటివరకు 99. 52 లక్షల మంది మహిళలు ఉచితంగా బస్సులలో ప్రయాణించారన్నారు.