మహబూబ్ నగర్ జిల్లా హన్వాడకు చెందిన గుంత చెన్నయ్య (35) ఈ నెల 26న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో ఉస్మానియా ఆస్పత్రిలో చేర్చారు. అత్యవసర విభాగంలో వైద్యం అందించిన వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. తండ్రి గోపాల్, కుటుంబసభ్యులు అంగీకరించడంతో అతడి కాలేయం, 2 కిడ్నీలు సేకరించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు, 2 కంటి కార్నియాలను చూపు లేని వారి అమర్చినట్లు శుక్రవారం జీవన్‌దాన్ ఇన్ఛార్జ్ స్వర్ణలత తెలిపారు.