కడ్తాల్ మండలంలోని జడ్పిటిసి జరుపుల దశరథ నాయక్ ఐదు సంవత్సరాల పదవి పూర్తయిన సందర్భంగా ఆయన స్వగృహంలో శుక్రవారం యువజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించి పూలమాలలు, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఐదు సంవత్సరాల కాలంలో బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను కుల మతాలకతీతంగా అందరికీ అందుబాటులో ఉండి సేవలందించారన్నారు.