తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి కేటీఆర్ మహిళలను గౌరవించడం నేర్చుకోవాలని మహిళ కాంగ్రెస్ నేత రేష్మ హితవు పలికారు. శుక్రవారం కల్వకుర్తి పట్టణంలోని పాలమూరు చౌరస్తాలో కేటీఆర్ వ్యాఖ్యలకు నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణం పై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆమె అన్నారు. మహిళలను బ్రేక్ డాన్సులు, క్యాబరి డాన్స్ లు చేయాలని అన్న ఆయన మాటలు ఆయన దురహంకారానికి నిదర్శనం అన్నారు.