వెల్దండ మండల భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికల కార్యాశాల (వర్క్ షాప్) బిజెపి కార్యాలయంలో గురువారం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా సంస్థాగత ఎన్నికల కన్వీనర్ మొగిలి దుర్గాప్రసాద్ హాజరై మాట్లాడుతూ సంస్థాగతంగా పార్టీ బలపడినప్పుడే బూత్ లో విజయం దక్కుతుందన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు నీరుకంటి రాఘవేందర్ గౌడ్, అసెంబ్లీ కన్వీనర్ ఎన్నం శేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.