ఉద్యోగులకు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ నెరవేర్చాలి: మాజీ మంత్రి

64చూసినవారు
ఉద్యోగస్తులపై ప్రభుత్వ వివక్షను సహించబోమని మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే, మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. మంగళవారం తెలంగాణ భవన్ లో మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఉద్యోగులకు చాలా హామీలు ఇచ్చిందన్నారు. 4నెలలు అవుతున్న ఉద్యోగ సమస్యలపై దృష్టి పెట్టలేదని, ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల హెల్త్ కార్డు, జర్నలిస్టులకు కార్పొరేట్ వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్