కాల్‌డ్రాప్స్‌పై దేశవ్యాప్తంగా 362 జిల్లాల్లో ‘లోకల్ సర్కిల్స్’ ఓ సర్వేను నిర్వహించింది. అందులో 89% మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు తేలింది. ఇందులో 38% మందికి తాము చేసిన కాల్స్‌లో 20 శాతానికి పైగా ఇదే సమస్య కనిపించింది. మొత్తం తమ కాల్స్‌లో సగం వరకు కాల్ డ్రాప్ ఎదురైనట్లు 17% మంది పేర్కొన్నారు. అందుకే వీరంతా వైఫై ద్వారా కాల్స్ చేసుకుంటున్నట్లు పేర్కొంది.