భవిష్యత్తులో అనాథలకు, నిరాశ్రయులకు అన్ని విధాల చేయూత నిస్తానని సివిల్ సర్వీసెస్ ఆల్ ఇండియా 3వ ర్యాంకర్ డోనూరు అనన్య రెడ్డి అన్నారు. శనివారం ఆమెకు అభినందన సభ ఎనుగొండ లోని రెడ్ క్రాస్ సన్నిధి ఆశ్రమంలో జరిగింది. రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నటరాజ్, వైస్ చైర్మన్ డాక్టర్ శామ్యూల్, కోశాధికారి జగపతి రావు, లయన్ రమణయ్య, శ్రీహరి, జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయ కర్త అశ్విని చంద్రశేఖర్, అశోక్ కుమార్ పాల్గొన్నారు.