మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామానికి చిన్నారి మిస్సింగ్ కలకలం రేపింది. రెండు రోజులుగా చిన్నారి ఎర్రమందెల అఖిల్ (6) కనిపించకుండా పోవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తల్లిదండ్రులు ఇంటి ముందు ఆడుకుంటుండగా అఖిల్ కనబడడం లేదని తల్లిదండ్రులు మిస్సింగ్‌పై పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాలుడి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.