బిజెపి నూతన కమిటీల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి

69చూసినవారు
బిజెపి రాష్ట్ర నాయకులు, జిల్లా ఇంచార్జ్ చింతల రామచంద్రారెడ్డి శనివారం ఆత్మకూర్ అమరచింత నర్వ మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా నర్వలో ఆయనను ఎద్దుల బండిపై ఊరేగింపుగా తీసుకెళ్లారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. బూత్, గ్రామ, మండలాల నూతన కమిటీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్