ఉట్కూర్ మండలం పెద్దజట్రం గ్రామానికి శివకుమార్ అనే వ్యక్తికి మంగళవారం బీజేపీ నాయకులు సిఎం సహాయ నిధి నుండి మంజూరైన రూ. 39 వేల చెక్కును అందించారు. కార్పొరేట్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం చేయించాలని బాధితుడి కుటుంబ సభ్యులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ రఘువీర్ యాదవ్, మాజీ ఎంపీటీసీ కిరణ్ కుమార్, జిల్లా బిజేవైఎం అధ్యక్షుడు భరత్ కుమార్, లీగల్ సెల్ కన్వీనర్ నందు నామజి, తదితరులు పాల్గొన్నారు.