మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి దెగ్లూర్ నియోజకవర్గ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కొలి సమాజ్ పెద్దలతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నివృతి కోడింబ కాంబ్లె ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. సమాజం ప్రజల అభివృద్ధికి కృషి చేస్తారని అన్నారు. అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు.