మక్తల్: అధ్వాన్నంగా మారిన రహదారి

50చూసినవారు
మక్తల్ మండలం జక్లైర్ గ్రామానికి వెళ్లే రహదారి అధ్వాన్నంగా మారింది. దీంతో రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. రహదారి గుండా ప్రతినిత్యం వందల సంఖ్యలో వాహనాలు ప్రయాణం చేస్తున్నాయని, ప్రయాణికులు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని సామాజిక కార్యకర్త మహేష్ గౌడ్ అన్నారు. అధికారులు వెంటనే రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టాలని కోరారు.

సంబంధిత పోస్ట్