వర్షాలకు కూలిన ఇళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే

81చూసినవారు
వరుసగా పడుతున్న వర్షాలకు మక్తల్ పట్టణంలోని కేశవ నగర్ వీధిలో కూలిన ఇళ్లను బుధవారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పరిశీలించారు. ఇల్లు కూలిన ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని, ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం నుండి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని అన్నారు. వర్షాల కారణంగా పురాతన ఇళ్లలో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్