మక్తల్ పట్టణంలో నూతనంగా నిర్మించే 150 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ స్థలాన్ని శనివారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈనెల 21న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆసుపత్రి నిర్మాణ పనులను, డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించేందుకు వస్తున్నారని చెప్పారు. మంత్రి పర్యటనకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అధికారులు పాల్గొన్నారు.