కేంద్ర రక్షణ శాఖ మంత్రి బండి సంజయ్ గురువారం నర్వ మండలం రాయికోడ్ గ్రామంలో పర్యటించారు. సంపూర్ణత అభియాన్ లో భాగంగా చేపట్టిన పనులను పరిశీలించారు. మోడల్ అంగన్వాడీ కేంద్రాన్ని, పల్లె దవాఖానను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్యం గురించి, అంగన్వాడీ ద్వారా గర్భిణీలకు, పిల్లలకు అందిస్తున్న పౌష్టిక ఆహారం గురించి తెలుసుకున్నారు. ఎంపి డికే అరుణ, ఎమ్మెల్యే శ్రీహరి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొన్నారు.