నల్లమల సఫారీలో పెద్దపులి

51చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ పులుల అభయారణ్యం లో పర్యాటకులకు పెద్దపులి కనిపించింది. శనివారం సఫారీ రైడ్ లో ప్రయాణిస్తున్న సందర్శకులకు ఫరహబాద్ ప్రాంతంలో పెద్దపులి కనిపించటంతో వారంతా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో సుమారు 40 వరకు పెద్దపులులు ఉన్నాయి. పర్యాటకులు సందర్శించే ప్రాంతాల్లో కనిపించడం చాలా అరుదు. సందర్శకులు పులి కనిపించడంతో ఆనందం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్