నాగర్ కర్నూల్ లో ఆదివారం భారీ వర్షం కురిసింది. దీంతో నాగర్ కర్నూల్ బస్టాండ్ సమీపంలో అత్యధికంగా వర్షం కురవడంతో వాహనదారులు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెలకపల్లి మండలం గౌరెడ్డి పల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో వర్షపు నీరు ఇండ్లలోకి వెళ్లడంతో కాలనీ వాసులు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షపు నీటి ఇండ్లలోకి వెళ్లడంతో వంట సామాగ్రి, బియ్యం నాని పాడైపోయాయి. ప్రభుత్వం నుంచి ఆదుకోవాలని కాలనీవాసులు కోరారు.