డబుల్ ఇండ్లకు మౌలిక వసతులను పూర్తి చేయాలి: కలెక్టర్

57చూసినవారు
డబుల్ ఇండ్లకు మౌలిక వసతులను పూర్తి చేయాలి: కలెక్టర్
డబల్ బెడ్ రూమ్ ఇండ్లకు కావలసిన మౌలిక వసతులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో పూర్తి అయిన 240 డబల్ బెడ్ రూం ఇండ్లను, ఇండ్ల పరిసరాలను పరిశీలించారు. డబల్ బెడ్ రూమ్ ఇండ్ల వివరాలను అధికారులతో అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులకు పంపిణీకి కావలసిన ప్రణాళికలను సిద్ధం చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్