సమాజంలోని ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారికి అండగా నిలువాలని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. గురువారం అచ్చంపేట ఎమ్మెల్యే జన్మదినాన్ని పురస్కరించుకొని యువజన కాంగ్రెస్, రెడ్ క్రాస్ సొసైటీ ధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. మున్సిపల్ కార్యాలయంలో కార్మికులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏరియా హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.