నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలను బుధవారం ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. వంటగది అపరిశుభ్రంగా కనిపించడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యతలేని కూరగాయలు వండడం ద్వారా విద్యార్థులు అనారోగ్య బారిన పడతారని అన్నారు. కాంట్రాక్టర్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.