నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం లక్ష్మీనృసింహ స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. లక్ష్మీనృసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో శుక్రవారం రథోత్సవం మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ప్రారంభించారు. జాతర ప్రాంగణం భక్తజనసందోహంతో కిక్కిరిసిపోయింది.
తేరును లాగేందుకు భక్తులు పోటీపడగా, రథాన్ని లాగినవారు గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణాన్ని భక్తులు మార్మోగించారు