నాగర్ కర్నూల్ జిల్లా శ్రీపురం గ్రామంలో పల్లె దవఖానను సందర్శించి, డ్రై డే ఫ్రైడే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ శుక్రవారం పరిశీలించారు. సీజనల్ వ్యాధులు సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరిస్తూ, అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామ ప్రజలకు మలేరియా చికెన్ గున్యాలాంటి వ్యాధులపై పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తున్నట్లు కలెక్టర్ కు వైద్యాధికారులు వివరించారు.