రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

52చూసినవారు
నారాయణపేట పట్టణ శివారు దామరగిద్ద రోడ్డులో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సుభాష్ రోడ్డుకు చెందిన రాకేష్ (28) స్పాట్లో చెందాడు. మినీ డీసీఎం వ్యాన్, ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా డీకొన్నాయి. ఘటనలో రాకేష్ తలకు తీవ్రమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్