నారాయణపేటలో దారుణం జరిగింది. తన ఇంటిపై అద్దెకుంటున్న ఐదేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారయత్నానికి పాల్పడినట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంట్లో ఉన్న చిన్నారికి మాయమాటలు చెప్పి యజమాని ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించినట్లు సమాచారం. బాలిక గట్టిగా కేకలు వేయండంతో కుటుంబ సభ్యులు గమనించి, చిన్నారిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. అఘాయిత్యానికి యత్నించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.