నారాయణపేట పట్టణంలో బతుకమ్మ సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. గురువారం సాయంత్రం రెండవ రోజు అటుకుల బతుకమ్మ వేడుకలు మహిళలు ఘనంగా నిర్వహించారు. బాపునగర్ వీధిలో ఆడపడుచులు రకరకాల పూలు, ఆకులతో బతుకమ్మలను అందంగా పేర్చి పసుపుతో చేసిన గౌరమ్మ కు పూజలు చేశారు. అనంతరం బతుకమ్మల చుట్టూ మహిళలు, చిన్నారులు జానపద, భక్తి పాటలకు బతుకమ్మ, కోలాటాలు అడి పాడారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.