విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్

85చూసినవారు
కలెక్టర్ సిక్తా పట్నాయక్ విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. అనుకోని అతిథిగా వచ్చి తమతో పాటు కింద కూర్చుని కలెక్టర్ భోజనం చేయడంతో ఆ విద్యార్థినుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దామరగిద్ద మండల కేంద్రంలోని కస్తూర్బా విద్యాలయాన్ని మంగళవారం మధ్యాహ్నం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ కి వెళ్లిన సమయంలో విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి సిద్ధం కావడంతో ఆహారం పరిశీలించేందుకు అక్కడే భోజనం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్