ఆలయ లడ్డూ ప్రసాద ట్రేలో అప్పుడే పుట్టిన ఎలుకలు (వీడియో)

60చూసినవారు
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాద వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన వేళ మరో ఆందోళనకర వీడియో బయటకు వచ్చింది. ముంబైలోని సిద్ధివినాయక ఆలయంలో లడ్డూ ప్రసాద ట్రేలో అప్పుడే పుట్టిన ఎలుకలు ఉన్నాయంటూ చూపిస్తున్న వీడియో వైరల్‌గా మారింది. అయితే, దీనిని ఆలయ అధికారులు ఖండించారు. ఇది తమ ఆలయానికి చెందింది కాదని, లడ్డూ విభాగానికి 25 మంది కార్మికులు 24 గంటలు పనిచేస్తున్నారని తెలిపారు. అలాంటి అపరిశుభ్ర పరిస్థితులు ఏర్పడే అవకాశం లేదని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్