నారాయణపేట జిల్లాలో తీవ్ర విషాదం

51చూసినవారు
నారాయణపేట జిల్లాలో తీవ్ర విషాదం
కోస్గి మండలం బలభద్రాయపల్లిలో నీటి గుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. గ్రామానికి చెందిన నరసింహ, కవిత దంపతులకు ఇద్దరు కొడుకులు నిహన్స్ (3), భానుమూర్తి (2) బుధవారం ఇంటి పక్కన ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి గుంటలో పడిపోయారు. పిల్లలు కనిపించకపోవడంతో వారు ఊరంతా గాలించారు. చివరకు నీటి గుంతలో వెతకడంతో మృతదేహాలు దొరికాయి. దీంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

సంబంధిత పోస్ట్