పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగినా పట్టించుకోరా

66చూసినవారు
పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగినా పట్టించుకోరా
నారాయణపేట జిల్లా దామరగిద్ద మండల మొగల్ మడకలోని ఎస్సీ కాలనీలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగాయి. పిచ్చిమొక్కలు ఏపుగా పెరగడంతో విష సర్పాలు సంచరించడంతో పాటు క్రిమి కీటకాలు, దోమల బెడద కూడా ఎక్కువైందని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని చికెన్ గున్యా, డెంగీ, మలేరియా, వైరల్ జ్వరాలు రాకుండా పిచ్చి మొక్కలు తొలగించాలని కాలనీవాసులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్