నారాయణపేట: జాతర ఉత్సవంలో పాల్గొన్న మాజీ డీసీసీ అధ్యక్షుడు

66చూసినవారు
నారాయణపేట: జాతర ఉత్సవంలో పాల్గొన్న మాజీ డీసీసీ అధ్యక్షుడు
నారాయణపేట మండలం బొమ్మన్ పాడు గ్రామంలో శుక్రవారం కాళికాదేవి జాతర సందర్భంగా మాజీ డీసీసీ అధ్యక్షుడు శివకుమార్ రెడ్డి అమ్మవారిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్