మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే

1900చూసినవారు
మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే
ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి మానవత్వం చాటుకున్నారు. శుక్రవారం సాయంత్రం నారాయణపేట మండలం సింగారం చౌరస్తా సమీపంలో ఆటో ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి. అటు నుండి వెళ్తున్న ఎమ్మెల్యే వాహనాన్ని నిలిపి గాయపడిన వ్యక్తికి ఒక డాక్టర్ గా వైద్య పరీక్షలు చేశారు. అనంతరం అంబులెన్స్ లో జిల్లా ఆసుపత్రికి పంపించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఫోన్ ద్వారా ఆదేశించారు.

సంబంధిత పోస్ట్