జిల్లా ఉంటుందా రద్దు చేస్తారా స్పష్టత ఇవ్వాలి

554చూసినవారు
నారాయణపేట జిల్లాను ఉంచాలనుకున్నారా లేక రద్దు చేయాలని అనుకున్నారా అనేది సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయాలని మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జిల్లాల రద్దుకు కమిటీ వేసినట్లు మీడియాలో వచ్చిందని, పేట జిల్లా రద్దు కాబోతుందని వస్తున్న వార్తల్లో నిజానిజాలు చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లాను రద్దు చేస్తే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్