నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టే భూసేకరణను చట్టబద్ధంగా చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వెంకట్రాంరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం నారాయణపేట పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల చేసి భూసేకరణ చేపట్టాలని అన్నారు. అదేవిధంగా నష్టపరిహారం, పునరావసం తదితర అంశాలపై రైతులకు ప్రజలకు స్పష్టత ఇవ్వాలని అన్నారు.