నారాయణపేట పట్టణంలోని జిల్లా ఆసుపత్రిని మంగళవారం ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఐసీయూ, జనరల్ వార్డు, ఇన్ పేషంట్ వార్డులు పరిశీలించారు. రోగులతో మాట్లాడి సమస్యలను, అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఆసుపత్రికి కావాల్సిన వసతులు, పరికరాలు, సమస్యల గురించి సూపరింటెండెంట్ మల్లికార్జున్ ను అడిగి తెలుసుకున్నారు.