మధ్యాహ్న భోజనం వికటించడంతో 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన బుధవారం తెలంగాణలోని నారాయణపేట జిల్లా మగనూర్ జడ్పీ పాఠశాలలో చోటుచేసుకుంది. మధ్యాహ్న భోజనం తిన్న కాసేపటికే 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వెంటనే వారిని మక్తల్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.