ప్రయాణికుల సౌకర్యం కొరకు ఆర్టీసీ బస్సులను పెంచాలని డిమాండ్ చేస్తూ బుధవారం నారాయణపేట ఆర్టీసీ బస్ డిపో ముందు సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ కార్యదర్శి కాశీనాథ్ మాట్లాడుతూ. మహాలక్ష్మి పథకం పెట్టడం ద్వారా మహిళ ప్రయాణికుల సంఖ్య పెరిగిందని, అందుకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. అన్ని గ్రామాలకు బస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.