AP: సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం శెట్టిపల్లి గ్రామంలో ఇంటి పైకప్పు షెడ్డు కూలి ఇద్దరు దుర్మరణం చెందారు. గ్రామ శివారులో శివారెడ్డి అనే రైతు పొలం దగ్గర నిర్మాణం చేస్తున్న షెడ్డు పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతులను నారాయణరెడ్డి, శివారెడ్డి లుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.