నారాయణపేట జిల్లా మాగనూర్ హైస్కూల్ విద్యార్థులకు ఫుడ్‌పాయిజనింగ్ కావడంతో అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. వీరిని మహబూబ్ నగర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈరోజు(గురువారం) ఉదయం విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఇచ్చిన ఉప్మా టిఫిన్ లో సైతం పురుగులు వచ్చాయి. దీంతో బాధితులు ఆందోళనకు దిగారు. ఆసుపత్రి సిబ్బందిని నిలదీశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.