చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా బుధవారం సాయంత్రం విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు. సుభాష్ రోడ్డులోని బారంభావి నుండి ప్రారంభమైన శోభాయాత్ర ప్రధాన రహదారుల గుండా గాంధీనగర్ వరకు సాగింది. యువకులు భారీ కాషాయ జండాలు పట్టుకొని డిజె భక్తి పాటలకు నృత్యాలు చేశారు. శోభయాత్రలో పెద్ద సంఖ్యలో యువకులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు.