ప్రధాని నరేంద్ర మోడీ వంద రోజుల పాలనలో ప్రజలకు, కార్మికులకు, కర్షకులకు ఎలాంటి మేలు జరగలేదని సీపీఐ జిల్లా కార్యదర్శి కొండన్న విమర్శించారు. సోమవారం నారాయణపేట పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాల నాయకులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. రైతులకు నల్ల చట్టాలు తీసుకొచ్చి తప్పు చేశామని పార్లమెంట్ సాక్షిగా రైతులకు క్షమాపణ చెప్పిన ఏకైక ప్రధానిగా నరేంద్ర మోడీ నిలిచారని అన్నారు.