పెరిగిన అధునాతన టెక్నాలజీ వాడుతూ సైబర్ కేటుగాళ్లు ప్రజలను ఆర్థికంగా దోచుకుంటున్నారని వారి ఉచ్చులో పడి ప్రజలు మోసపోవద్దని నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. లోన్ యాప్ ద్వారా రుణాలు తీసుకోవద్దని, ఫోన్లకు వచ్చే అనవసరపు లింకులు తెరవకూడదని సూచించారు. అపరిచితులకు బ్యాంకు ఖాతా, ఓటిపి, క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలు ఇవ్వకూడదన్నారు. సైబర్ మోసంలో ఆర్థికంగా నష్టపోతే వెంటనే ఫిర్యాదు చేయాలన్నారు.